Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌స్వచ్ఛత వొక జీవన విధానంగా మారాలి

స్వచ్ఛత వొక జీవన విధానంగా మారాలి

స్వచ్ఛత వొక జీవన విధానంగా మారాలి

సిటియు విసి టీవి కట్టిమని

న్యూస్‌తెలుగు/విజయనగరం ; ఆంధ్రప్రదేశ్ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం లో స్వచ్ఛతా హీ మరియు స్వచ్ఛతా పఖ్వాడా – 2024 కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ టి.వి. కట్టిమని మాట్లాడుతూ స్వచ్ఛత ఒక వారమో వొక నెలో కాకుండా జీవన శైలిలో భాగంగా మారాలని శారీరక పరిశుబ్రత, మానసిక పరిశుబ్రత, పరిసరాల పరిశుబ్రత అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
స్వచ్ఛతా హీ సేవా మరియు స్వచ్ఛతా పఖ్వాడా కార్యక్రమాలలో జరిగిన ముఖ్య కార్యకలాపాలపై సమీక్షతో ఈ వేడుక ప్రారంభమైంది. ఈ కార్యక్రమాలకు చైర్మన్ , నోడల్ ఆఫీసర్ డా. బొంతు కోటయ్య వివిధ కార్యక్రమాలపై ఒక నివేదికను సమర్పించారు. ఈ కార్యక్రమాలలో స్వచ్ఛత ప్రతిజ్ఞ, విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు, సిబ్బందితో కూడిన పెద్ద స్వచ్ఛతా డ్రైవ్స్, అవగాహన వర్క్షాపులు, హగ్ ఎ ట్రీ, ఒక మొక్క అమ్మకు పేరుతో, గ్రామ సభ, మారథాన్,మానవ హారం, వీధి నాటకం, ఫ్లాష్ మాబ్, సఫాయ్ మిత్ర సురక్ష శిబిరం, విద్యార్థులు, అధ్యాపకులు, సమాజ సభ్యులను పరిశుభ్రత, స్థిరత్వం పై చైతన్యం కలిగించేందుకు నిర్వహించిన పలు పోటీలు ఉన్నాయి. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ టి.వి. కట్టిమని పాల్గొని పలు విభాగాల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి. శ్రీనివాసన్, వివిధ డీన్ లు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.  (Story : స్వచ్ఛత వొక జీవన విధానంగా మారాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!