ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 15 ఫిర్యాదులు
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 15 ఫిర్యాదులు అందినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఫిర్యాదును ఖచ్చితంగా పరిష్కరించేలా చూడాలని, అవసరమైతే ఇతర శాఖల సమన్వయంతో సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయం స్థాయిలో ప్రతి సచివాలయంలో సెక్రెటరీ సెలవు పెట్టిన, ఇన్‌చార్జి సెక్రటరీని ఏర్పాటు చేసి, ప్రజలు తీసుకొచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించేందుకు చర్యలు తీసుకొని, సచివాలయం స్థాయిలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తూ, సంతృప్తికరమైన పరిష్కారం ఇచ్చిన తర్వాతే ఆ ఫిర్యాదును ఆన్‌లైన్‌లో క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అనధికార ఆక్రమణలు, డ్వాక్రా సంఘాల సమస్య, రోడ్డు, డ్రెయినేజీ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులకు సత్వర, సంతృప్తికర పరిష్కారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (Story : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 15 ఫిర్యాదులు)