Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బ్రేకింగ్ : రేపల్లె లో ఘోర రోడ్డు ప్రమాదం 

బ్రేకింగ్ : రేపల్లె లో ఘోర రోడ్డు ప్రమాదం 

0

బ్రేకింగ్ : రేపల్లె లో ఘోర రోడ్డు ప్రమాదం 

ఇద్దరు మృతి….ఆరుగురు తీవ్ర గాయాలు

న్యూస్‌తెలుగు/రేపల్లె : రేపల్లె నుండి మచిలీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సును అవనిగడ్డ వైపు నుండి రేపల్లె వస్తున్న అశోక్ లేలాండ్ గూడ్స్ వెహికల్ ఢీకొనగా రేపల్లె – పెనుమూడి వారధి వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా ఆరుగురికి గాయాలు అయినట్లు రేపల్లె పట్టణ సీఐ మల్లికార్జున రావు తెలిపారు. అతివేగంగా వాహనం రావడంతో ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. అశోక్ లేలాండ్ వెహికల్ లో ఉన్నటువంటి పదిమందిలో ఇద్దరు మరణించారు. మిగిలిన వారు తీవ్ర గాయాలకు లోనై రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి కొంతమంది, అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రి కి, గాయాలైన వారిని తరలించి చికిత్సలు అందిస్తున్నట్లు సీఐ తెలిపారు. దీంతో వారధి వద్ద తీవ్ర ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.

వాహనాలు రేపల్లె వైపు వారధి కి అటువైపు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వారధిపై జరిగిన ప్రమాదంతో ఆ ప్రాంతమంతా క్షతగాత్రులు ఆహాకారాలతో మృతులు కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు .మృతి చెందిన వారు రేపల్లె మండలం బేతపూడి, చిన్న అరవపల్లి, గ్రామాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు .ప్రమాదం జరిగిన స్థలాన్ని రేపల్లె డిఎస్పి మురళీకృష్ణ, సిఐలు మల్లికార్జునరావు, సురేష్ బాబు, పోలీస్ సిబ్బంది, బాధితులను పరామర్శించి జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. పెనుమూడి వారధి వద్ద రోడ్డు ప్రమాదంతో ఆ ప్రాంతమంతా బాధితుల ఆర్తనాధలతో చోటుచేసుకుంది. వారధి వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. (Story : రేపల్లె లో ఘోర రోడ్డు ప్రమాదం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version