Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో వైద్యులదే కీలకమైన పాత్ర

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో వైద్యులదే కీలకమైన పాత్ర

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో వైద్యులదే కీలకమైన పాత్ర

ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో వైద్యుల పాత్రయ కీలక పాత్ర అని ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణములోని పిఆర్టి సర్కిల్లో గల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన 22వ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరైనారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మార్చేందుకు ప్రతి వైద్యుడు కృషి చేయాలని తెలిపారు. వైద్య సిబ్బంది సహకారంతో ఇది సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి వైద్యుడు వైద్య సేవలను అందించడం తమ వృత్తిగా కాకుండా ఒక సామాజిక సేవగా బాధ్యతగా భావించాలని వారు కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికరించి మెరుగైన సౌకర్యాలు కల్పించేలా తాము కృషి చేస్తున్నట్లు వారు ప్రకటించారు. అంతేకాకుండా వైద్యుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లవేళలా అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య సేవలు అభివృద్ధి కోసం వైద్యులు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాలు మరింత బలబడుతాయని వారు తెలిపారు. వైద్యులు మానవతా కోణంలో రోగులకు వైద్య చికిత్సలను అందించాలని, వైద్యుల రక్షణ చట్టాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వము వైద్యులు పరస్పర సహకారంతో ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలని తెలిపారు.తదుపరి వైద్యులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొని రాగా వాటిని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లతో చర్చించి పరిష్కరించేందుకు తప్పక కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. తదుపరి ఐఎంఏ వారు ఆరోగ్యశాఖ మంత్రిని ఘనంగా సన్మానించి, షీల్డ్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ ఎం. జయ చంద్ర నాయుడు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పనిధర్, రాష్ట్ర జనరల్ కార్యదర్శి డాక్టర్ నందకిషోర్, పూర్వ అధ్యక్షులు రాష్ట్ర యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ, ఐఎంఏ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సి జయ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సమావేశ నిర్వాహకులు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ ఎస్వీకే ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర మాజీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సుబ్బారావు,ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వాసుదేవ రెడ్డి, డాక్టర్ నరసింహులు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పనిధర్, ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ నందకిషోర్, రాష్ట్రం నలుమూలల నుండి ఐఎంఏ నాయకులు,తదితరులు పాల్గొన్నారు. (Story : ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో వైద్యులదే కీలకమైన పాత్ర)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!