ప్రైవేట్ టీచర్ల ఆత్మీయ సమ్మేళనం
న్యూస్ తెలుగు /వనపర్తి : హైదరాబాద్ దిల్ సుక్ నగర్ లోని బృందావన్ గార్డెన్ లో ప్రైవేట్ టీచర్ల ఆత్మీయ సమ్మేళనం ఉపాధ్యాయ దినోత్సవానీ పురస్కరించుకొని ఉత్తమ టీచర్ల అవార్డు ప్రధాన కార్యక్రమం జరిగినది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సురభి వాణి దేవి , తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్ మాజీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా, సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు, ఎం బి సి సంచార జాతర రాష్ట్ర అధ్యక్షులు కోల శ్రీనివాస్ , ప్రైవేట్ టీచర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అజయ్ కార్తిక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వారి దేవి మాట్లాడుతూ ప్రైవేటు టీచర్ల హక్కుల కోసం సంక్షేమం కోసం అండగా ఉంటామని ఆశాభావం వ్యక్తపరిచారు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ప్రైవేటు టీచర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని ఉప్పల శ్రీనివాస్ గుప్తా హామీ ఇచ్చారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు మాట్లాడుతూ ప్రైవేటు టీచర్లు శ్రమ దోపిడికి గురవుతున్నారని అందరూ ఐక్యంగా ఉండి హక్కుల సాధనలో కలిసి రావాలని ప్రైవేట్ టీచర్ల అభివృద్ధి కోసం కేంద్ర సంఘం మొత్తం తోడుగా ఉంటుందని రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిగా కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రైవేటు టీచర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షులు అజయ్ కార్తీక్ మాట్లాడుతూ టీచర్లు తమ హక్కుల కోసం సంక్షేమం కోసం మనకు రావాల్సిన వాటర్ కోసం సంఘం లో చేరాలని మన అభివృద్ధికి మనమే పాటు పాడాలని పిలుపునిచ్చారు. తర్వాత వివిధ ప్రవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు మరియు అన్ని విభాగాల టీచర్లకు అవార్డులు ఇస్తూ సత్కరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ప్రైవేటు టీచర్ల తో పాటు వ్యాయమా ఉపాధ్యాయుల కమిటీ సభ్యులు ,కూడా పాల్గొన్నారు.(Story:ప్రైవేట్ టీచర్ల ఆత్మీయ సమ్మేళనం)