చేనేత వస్త్రాలపై హిందీలో నేసిన వైనం
న్యూస్‌తెలుగు/ ధర్మవరం ( శ్రీ సత్యసాయి జిల్లా) : హిందీ పక్షం సందర్భంగా ఈనెల 28వ తేదీ అనగా ఈరోజు శనివారం నాడు అధికారిక భాష హిందీ గర్వాన్ని వ్యక్తం చేస్తూ చేనేత వస్త్రాలపై నేసిన నినాదాన్ని న్యూఢిల్లీలోని డెవలప్మెంట్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో కేంద్రహ్యాండ్లు మినిస్టర్ గిరిరాజ్ సింగ్ కు, అభివృద్ధి కమిషనర్ చేనేత, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగిందని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన డిజైనర్ నాగరాజు పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సందేశాన్ని విజయవాడలోని చేనేత సేవా కేంద్రం వారి సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ లోని డిజైనర్ నాగరాజు గా తాను చేయడం ఎంతో సంతోషాన్ని, తృప్తిని ఇచ్చిందని తెలిపారు. డిజైనర్ నాగరాజుగా తాను కళాకారుడునని, ఈ హిందీ పక్షం ద్వారా స్వచ్ఛమైన పట్టు బంగారు జెరిపోగులను ఉపయోగించి పట్టు వస్త్రంపై చేతితోనే చేయడం జరిగిందని తెలిపారు. ఈ వస్త్రమునందు హిందీ దేశ గర్వం అనే నినాదం, భారత రాజముద్ర, ఇతర డిజైన్లు పట్టు వస్త్రమునందు వచ్చే విధంగా చేనేత మగ్గము నందు తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఈ వస్త్రాన్ని తయారు చేయుటలో సురేంద్రబాబు రాఘవ అను చేనేత కార్మికుల సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు. (Story : చేనేత వస్త్రాలపై హిందీలో నేసిన వైనం)