విద్యార్థి సంఘాలు డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి
ఆరోగ్య శాఖామంత్రికి ఫిర్యాదు
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం;ధర్మవరం పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు వైద్య ఆరోగ్య శాఖామంత్రి గారిని కలసి తమ తమ పాఠశాలలో ముఖ్యంగా విద్యార్థి సంఘ నాయకులమని చెప్పి విద్యార్థులు కాని వారు అనగా కొంతమంది ఎటువంటి రెగ్యులర్ విద్యను అభ్యసించ కుండా వివాహము జరిగి పిల్లలు కలిగి ఉన్నప్పటికీ వారు దూరవిద్య కోర్సులను చేస్తూ తామే సంఘాలను నెలకొల్పుకొని వివిధ కారణాలను చూపుతూ డబ్బులను డిమాండ్ చేయడం జరుగుతోందని, అటువంటి వారిపై చర్యలు గైకొనాలని కోరుతూ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థ యాజమాన్యాలు పాఠశాలలను సక్రమంగా నడుపుకోవడానికి గాని, ఇతరత్రా నిత్య విద్యాభోధన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి గాని వీలుండక భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ఈ సమస్యలను నుండి మాకు రక్షణ కల్పించవలసినదిగా వారు తెలిపారు. అదేవిధంగా పట్టణము యొక్క డీఎస్పీ అర్బన్, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లను కలిసి వినతి పత్రాన్ని సమర్పించగా వారు సానుకూలంగా స్పందించడం జరిగినది అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ధర్మవరం పట్టణంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థల యొక్క కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. (Story : విద్యార్థి సంఘాలు డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి)