మందు బాబులకు జరిమానా
న్యూస్ తెలుగు/సిద్ధిపేట జిల్లా ప్రతినిధి (నారదాసు ఈశ్వర్): మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. సిద్ధిపేట ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వాహనాల తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా 27 మంది మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని పట్టుకున్నట్టు ఆయన చెప్పారు. వారిని కోర్టులో హాజరు పరచగా ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి కాంతారావు 27 మందికి రూ.లు.9200 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు (Story : మందు బాబులకు జరిమానా)