సమాజ సేవకుడు, రక్తదాత పివి సురేష్ కు డాక్టరేట్ అవార్డు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ పట్టణానికి చెందిన, అందరికీ ఆప్తుడైన సమాజ సేవకుడు, రక్తదాత, బెస్ట్ సోషల్ యాక్టివ్ వర్కర్ అవార్డు గ్రహీత పివీ సురేష్ బాబు కి ప్రతిష్టాత్మక వరల్డ్, హ్యూమన్ రైట్స్ ప్రొటక్షన్ కమిషన్ ( డబ్ల్యూహెచ్ఆర్ పిసి) వారిచే ఢిల్లీ లోని అశోక హోటల్ నందు శనివారం గౌరవ డాక్టరేట్అవార్డు ని కేంద్ర మాజీ మంత్రి షహనాజ్ హుస్సేన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమం లో పార్లమెంట్ సభ్యులు, వివిధ దేశాల హై కమీషనర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణం లోని ప్రముఖులు, మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. (Story : సమాజ సేవకుడు, రక్తదాత పివి సురేష్ కు డాక్టరేట్ అవార్డు)