మడమ తిప్పని ఆంధ్రుడు జాషువా
న్యూస్‌తెలుగు/ వినుకొండ : ఆత్మవిశ్వాసంతో అకుంఠిత దీక్షతో కవితాగర్జన చేసి అనంతమైన కావ్య జగత్తుకు సృష్టికర్త కవియేనని చాటిన మహానుభావుడు గుర్రం జాషువా. సమాజంలోని అసమానతలను తన కవితా ఖడ్గంతో దునుమాడిన “నవయుగకవిచక్రవర్తి” జాషువా తను కోరుకున్న సమాజం కొరకు తన కవితా శక్తిని ధారపోసి, దళితవ్యధలను “గబ్బిలమై” ప్రపంచానికి చాటి, సాహిత్యలోకాన్ని “కవికోకిల”గా పరవసింపజేసి సమాజంలోని అస్పృశ్యతాసంకెళ్ళను తెంచి “మడమ తిప్పని ఆంధ్రుడును” అంటూ విశ్వనరుడుఅయ్యాడు. అంతటి జాషువా 129వ జయంతి సందర్బంగా ఆయనని స్మరించుకుంటూ వినుకొండ పట్టణం లోని వైసీపీ కార్యాలయం నందు అయన చిత్రపటానికి ఘన నివాళి అర్పించిన వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, వైసీపీ ( టి.యు.సి ) పి.గౌతమ్ రెడ్డి , నియోజకవర్గ వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. (Story : మడమ తిప్పని ఆంధ్రుడు జాషువా)