బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థను అరికట్టి నిత్యవసర ధరలు తగ్గించాలి
జ్యోతి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి
న్యూస్ తెలుగు /వరంగల్, ములుగు :
పాలకవర్గాలు అవలంబిస్తున్న దివాలా కోరు, ఆర్థిక విధానాల వలన, బ్లాక్ మార్కెట్ వ్యవస్థ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతూ, రైతు పండించినటువంటి పంటలకు కూరగాయలకు మద్దతు ధర చెల్లించకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, సిపిఐ వరంగల్ సీనియర్ నాయకులు మోతే లింగా రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం హాసన్ పర్తి మండల కేంద్రంలో సిపిఐ హాసన్ పర్తి మండల కమిటి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా జ్యోతి, లింగా రెడ్డి మాట్లాడుతూ, రైతులు పండించిన వాటిని, మార్కెట్ కు వచ్చినటువంటి వాటిని బ్లాక్ మార్కెట్ చేస్తూ కృత్రిమ కొరతను సృష్టిస్తూ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పప్పులు నూనెలు ఇతర నిత్యవసర వస్తువులు కూరగాయల ధరలు విపరీతంగా పెంచడం మూలంగా, మధ్యతరగతి పేద ప్రజలు తీవ్ర ఆర్థిక భారంతో ఇబ్బందుల పాలవుతున్నారని వెంటనే పెరిగిన ధరలను తగ్గించి పేదలని ఆదుకోవాలని, పాలకులను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి సిపిఐ సీనియర్ నాయకులు మోతిలింగారెడ్డి హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టి ధరలను తగ్గించాలని, వెంటనే వినియోగదారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.కనీస మద్దతు ధర, గిట్టుబాటు ధర లేక పండించినటువంటి రైతాంగాన్ని ఒకవైపు ,మధ్య దళారీ వ్యవస్థ దోపిడీ చేస్తుండగా బ్లాక్,మార్కెట్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తూ విపరీతంగా ధరలు పెంచి వినియోగదారులను విపరీతంగా దోచుకోవడం జరుగుతుందన్నారు.ఈ దోపిడి పై ప్రజలు తిరుగుబడక ముందే, ధరలను తగ్గించి,పేదలని ఆదుకోవాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో హాసన్ పర్తి మండల సిపిఐ కార్యదర్శి మెట్టు శ్యాంసుందర్ రెడ్డి,బి సి హక్కుల సాధన సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి నేదునూరి రాజమౌళి, మైనార్టీ నాయకులు షేక్ బాబు, జయగిరి,సిపిఐ కార్యదర్శి గడ్డం చంద్రమౌళి,కనకయ్య,, శ్రీలత పాల్గొన్నారు (Story : బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థను అరికట్టి నిత్యవసర ధరలు తగ్గించాలి)