పాడి రైతులను ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ పట్టణంలోని రైలు పేటలో లింగ శైలజ రామయ్య అధ్యక్షతన
పాడి రైతుల సమావేశం శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ. పాడి రైతులు అనేక ఇబ్బందులతో పాడి రైతులు
పాడిని నిర్వహించడం జరుగుతుందని, ఒక్కొక్క గేదెను సుమారు 70 వేల నుండి లక్ష రూపాయల పైన పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుందని, ఏదైనా ప్రమాదం జబ్బులు వచ్చి గేదెలు చనిపోతే చాలామందికి ఇన్సూరెన్స్ వర్తించటం లేదని, పాడి రైతులందరికీ కూటమి ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించి పాడి రైతులకు భరోసా ఇవ్వాలని, అదేవిధంగా వినుకొండ పట్టణ లాంటి ఏరియాల్లో పశువుల హాస్పిటల్ కి గేదెల్ని తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందులకు ఎదురవుతున్నాయని వినుకొండ పట్టణంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉండటంవల్ల గేదెల్ని టౌన్ లోకి రావద్దని మున్సిపల్ అధికారులు ఆదేశాలు ఇచ్చారని, గేదలకి ఏదన్న జబ్బు చేస్తే చికిత్స చేయించాలి అంటే బాగా ఖరీదైందని ప్రభుత్వం పెద్దమనసు చేసి వినుకొండ పట్టణ లాంటి ఏరియాలో ఇళ్ల వద్దే పశువులకు వైద్య చేసే విధంగా చూడాలని అదేవిధంగా ఇటీవల కాలంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు వరదలతో రైతుల పంట పొలాలు కొట్టుకుపోయి రైతులకు పశుగ్రాసానికి ఇబ్బంది పడుతుంటే పల్నాడు జిల్లా వినుకొండ లాంటి ప్రాంతంలో సరైన వర్షాలు పడక రైతులు పంటలు కూడా ఇంకా ఏయేని పరిస్థితి ఈ ప్రాంతాల్లో పశుగ్రాసం లేక పాడి రైతులు పక్కా జిల్లాల నుండి వరిగడ్డిని మీడియేటర్ ద్వారా తెప్పించుకొని కొనుక్కునే పరిస్థితి అది కూడా బాగా కమర్షియల్ గా మారింది. కూటమి ప్రభుత్వాన్ని పాడి రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తుంది. 2015, 2016 సంవత్సరములు ఇప్పటి కూటమి ప్రభుత్వం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పాడి రైతులకు టిఎంఆర్ దాన శైలజ గడ్డి ప్యాకింగ్ఇచ్చి పాడి రైతుల్ని ఆదుకోవడం జరిగిందని పల్నాడు జిల్లా రైతుల పట్ల దయవుంచి టిఎంఆర్. దానా ను పాడి రైతులకు సబ్సిడీపై ఇప్పించవలసిందిగా రైతుల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని రాము విజ్ఞప్తి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాడి రైతులు వరగాని మాధవి లింగ శైలజ ,లింగారావు, ఏసోబు ,మాధవి, మస్తాన్, బి అమూర్తమ్మ ,సైదాబీ అనేకమంది పాడి రైతులు పాల్గొన్నారు. (Story : పాడి రైతులను ఆదుకోండి)