ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు అనన్యమైనవి..
ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అనన్యమైనవని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి భజన మండలి పాత భజన మందిరం శుభదాసు సత్రం వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు ఉదయం పాలు, బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. సేవాదాతగా వీఆర్వో బాలయ్య పెను కొండ వారు నిర్వహించడం పట్ల కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భజన మండలి సేవకులు పాల్గొన్నారు. (Story : ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు అనన్యమైనవి.. )