జి.పి.ఎస్ విధానం మార్చాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి జిల్లా విద్యా వ్యవస్థ కొరకు ఉపాధ్యాయులు ప్రార్థన వేళలకు వెళ్లడం గురించి.జిల్లా అధికార యంత్రాంగం నూతనంగా ఏర్పాటు చేసిన జి.పి.ఎస్ విధానం వల్ల ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గురి కావడం జరుగుతుందని. వెంటనే ఇవాళ ఆ విధానం మార్చాలని అఖిలపక్ష ఐక్యవేదిక అన్నారు. తగు చర్యలు తీసుకోవాలని
జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయినీల యొక్క వ్యక్తిగత ఫోటోలు బహిర్గతం కావడంతో పాటు అనేక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని. ఈ విధానం రాష్ట్రంలో ఎక్కడ లేదని, ప్రత్యామ్నాయంగా వేరే విధానాన్ని అమలు చేసి పర్యవేక్షణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగింది. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి తమ వ్యక్తిగత ఫోటోలు కాకుండా టీచర్లు క్లాస్ రూమ్ లో ఉండే విద్యార్థి, విద్యార్థినీల గ్రూప్ ఫోటోలు తీసి పంపించవలసిందిగా సిఫారసు నోటు డీ.ఈ.వో గారికి రాయడం జరిగింది. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. తదనంతరం తెలంగాణ బాపూజీ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కలెక్టర్ ఆఫీసులో జిల్లా కలెక్టర్ బృందం తో పాటు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ నాయకుడు వెంకటేష్, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, బీసీ సంఘం నాయకులు బొడ్డుపల్లి సతీష్, గౌనికాడి యాదయ్య, శివకుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : జి.పి.ఎస్ విధానం మార్చాలి)