కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయా సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధన కోసం తెలంగాణలోని ప్రతి పౌరుడు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూ 109వ జయంతి వేడుకలను శుక్రవారం ఉదయం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో జిల్లా బి.సి. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, పద్మశాలి సంఘం నాయకులు కొండా లక్ష్మణ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కొరకు పోరాటం చేసిన మహనీయులను తెలంగాణ సమాజం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ, వారు చూపిన అడుగుజాడల్లో నడుస్తుంది అన్నారు. మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తుందని తెలిపారు. మహనీయుల ఆశయ సాధన కొరకు రాబోయే రోజుల్లో మరింత కృషి చేస్తామని ఇందులో ప్రజలు తమవంతు సహకారం అందించాలని కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి సంఘం చైర్మన్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తొలి, మలి విడత ఉద్యమంలో కొండా లక్ష్మణ్ నిస్వార్థంగా పోరాటం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమం కొరకు తన స్వంత ఇంటిని కార్యకర్తల సమావేశం కొరకు కేటాయించిన నిశ్వార్థపరుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్, బి.సి. సంక్షేమ శాఖాధికారి బి. సుబ్బారెడ్డి, జిల్లా అధికారులు, బి.సి. పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్, కోళ్ల వెంకటేష్, యం. దేవన్న నాయుడు, పద్మశాలి సంఘం నాయకులు సతీష్ యాదవ్, జే . వెంకట్రములు, శ్రీనివాసులు, సత్యనారణ, రాములు బాలస్వామి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు (Story : కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయా సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి)