వార్షిక తనిఖీలో భాగంగా పస్రా పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరిష్
ఎఫ్ ఐ ఆర్ ల నమోదు,కేసులలో నేర దర్యాప్తు నిష్ష్పక్షపాతంగా నిర్వహించాలి
ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి కనీస అవసరాలు కల్పించాలి
డయల్ 100 కాల్స్ కు సత్వరమే స్పందించాలి
విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవు
జిల్లా ఎస్ పి డా. శబరిష్
న్యూస్ తెలుగు /ములుగు :
వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం పస్రా పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్ పి డా. శబరిష్ తనిఖీ చేసారు. స్టేషన్ లోని రికార్డ్స్ ను పరిశీలించి, కేసుల నమోదు వాటి యొక్క స్థితి గతులను తెలుసుకుని పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క కిట్ ఆర్టికల్స్, ఆయుధ సామాగ్రిని ని తనిఖీ చేసి సిబ్బంది కవాతు నైపుణ్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ సిబ్బందితో మాట్లాడుతూ బాధిత వ్యక్తుల నుంచి ఫిర్యాదును స్వీకరించిన అనంతరం, వారికి వెంటనే రసీదు అందించాలని,ఎఫ్ ఐ ఆర్ నమోదు, కేసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా నమోదు చేయాలని రిసెప్షన్ డ్యూటీస్ లో ఫిర్యాదుదారుని పట్ల మర్యాదగా ప్రవర్తించాలన్నారు. పోలీస్ స్టేషన్ కు వస్తే న్యాయం చేకూరుతుంది అనే, నమ్మకం కలిగే విధంగా నిష్పాక్షపాతంగా పని చేయాలనీ, నేర పరిశోధనలో దర్యాప్తు అధికారి సాక్షాధారాలను సేకరించడంలో నైపుణ్యంగా వ్యవహరించాలని, గ్రామ పోలీసు అధికారి గ్రామంలో గల ప్రజల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు స్టేషన్ హౌస్ అధికారికి తెలియచేయాలని, విధులలో నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హేచ్చరించారు.
అనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్ ఆవరనలో గల నమోదు కాబడని లేదా వదిలివేయబడిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ ఉద్యోగం అనేది భాద్యతతో కూడుకున్నదని, క్రమశిక్షనతో ఉద్యోగం చేయాలనీ తెలిపారు.పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కార దిశగా ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో ములుగు ఓ.ఎస్.డి మహేష్ బాబా గితే,ములుగు డి.ఎస్.పి రవీందర్, పస్రా సి ఐ రవీందర్, ఎస్సై కమలాకర్, ప్రొబేషనరీ ఎస్ఐ బుట్టి చంద్రశేఖర్, నరేష్ బుస్స, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : వార్షిక తనిఖీలో భాగంగా పస్రా పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరిష్)

