తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ గొప్ప స్ఫూర్తి ప్రదాత
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా జి. చిన్నా రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకొని గురువారం ఉదయం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రాంగణంలో బి.సి. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి పూల మాల వేసి ఘనంగా నివాళుల్పించారు.ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి మాట్లాడుతూ నిజాం సర్కారు కాలం లో చాకలి ఐలమ్మ కౌలుకు భూమి తీసుకొని పండించిన పంటకు అన్యాయంగా శిస్తు అని చెప్పి దోచుకువెళుతుంటే మహిళ అయినప్పటికీని వెరవకుండా అన్యాయానికి ఎదురొడ్డి పోరాడిందని ఆమె తో పాటు చుట్టూపక్కల గ్రామాల ప్రజలతో కలిసి ఒక ఉద్యమమే నడిపిందని గుర్తు చేశారు. అందుకే ఆమెను వీర నారి ఐలమ్మ అని పిలుచుకుంటాము అన్నారు. ఆ కాలంలో లోనే ఎందరికో ఆదర్శమూర్తి అయి ఉద్యమాలు చేసిందన్నారు. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ఉద్యమకారులను ఒక్క తాటిపైకి తెచ్చి దేశముఖ్ లకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వీర నారి చాకలి ఐలమ్మ కు జయంతి ఉత్సవాలు, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, బి.సి. సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి బి. సుబ్బారెడ్డి, రాచల యుగందర్ గౌడ్ బి.సి పొలిటికల్ JAC చైర్మెన్, కోళ్ళ వెంకటేష్ దళిత నాయకులు, రజక సంఘ నాయకులు తెనేటి. ఆంజనేయులు, GJ.శ్రీనివాసులు,మహేష్ కుమార్, రవి, శ్రీనివాసులు, C . కొండన్న, తిరుమలేష్భీముడు, శ్యాంమ్ కుమార్, D. శ్రీను ఆర్మీ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.(Story:తెలంగాణ వీర నారి చాకలి ఐలమ్మ గొప్ప స్ఫూర్తి ప్రదాత.)