ఫుట్బాల్ పోటీలకు ముస్తాబైన లయోలా స్కూలు
న్యూస్‌తెలుగు/వినుకొండ : ముస్తాబవుతున్న లయోలా హై స్కూల్ ఈనెల 28 నుండి 30వ తేదీ వరకు 68వ అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ అండర్- 17 బాలబాలికలకు వినుకొండ లయోలా హై స్కూల్ నందు ఫుట్బాల్ రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతున్నాయని పలనాడు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎం సురేష్ కుమార్ తెలిపారు. ఈ టోర్నమెంట్ నందు 13 జిల్లాల నుండి 520 మంది బాలబాలికలు మరియు అన్ని జిల్లాల నుండి కోచ్ మేనేజర్లు పాల్గొననున్నారని, ఈ టోర్నమెంట్లో క్రీడాకారులకు ఉచిత వసతి మరియు భోజనాలను ఏర్పాటు చేయడమైనదని ఇప్పటికే గుంటూరు జిల్లా జట్టు సాధన చేయడం జరుగుతుంది అని లయోలా ఉన్నత పాఠశాల యాజమాన్యం జ్ఞానదేవ్ ఫాదర్, హెచ్ఎం రవి ఫాదర్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, డిఇఓ ఎం వెంకటేశ్వర్లు మార్గదర్శక మరియు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ఆర్గనైజేషన్ సభ్యులు బి. ఏడుకొండలు, పి. ఎలమంద, ఆర్. రాధాకృష్ణమూర్తి, వై .వి. చిరంజీవి రావు, జి. వీరాంజనేయులు, కే. రాజేష్, వినుకొండ జోన్ వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. (Story : ఫుట్బాల్ పోటీలకు ముస్తాబైన లయోలా స్కూలు)

