మృతుల కుటుంబాలను పరామర్చించిన మంత్రి
న్యూస్ తెలుగు /ములుగు : మృతుల కుటుంబాలను పరామర్శించి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారు.. ములుగు జిల్లా,ఏటూరునాగారం మండలం, చల్పాక గ్రామానికి చెందిన బోడ లక్ష్మయ్య,, బాణాజీబంధం గ్రామానికి చెందిన అట్టెం నాగేశ్వరరావు, అట్టెం కిష్టయ్య,ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించగా,వారి కుటుంబ సభ్యులను, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దన సరి అనసూయ సీతక్క పరామర్శించి మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు,బ్లాక్ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు,అన్ని అనుబంధ సంఘాల నాయకులు,యువజన నాయకులు,మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story ; మృతుల కుటుంబాలను పరామర్చించిన మంత్రి)