నేడు ఆరోగ్య శాఖ మంత్రి ధర్మవరం రాక
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గురువారం ధర్మవరంలో పర్యటిస్తున్నట్లు కార్యాలయ అధికారులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్టోబర్ 26న ఉదయం 10 గంటలకు తాడిమర్రిలో ఏర్పాటుచేసిన మంచి ప్రభుత్వం కార్యక్రమములో పాల్గొంటారని, తదుపరి 27న శుక్రవారం ఉదయం 10 గంటలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో అభివృద్ధి కొరకు ప్రభుత్వ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొంటారని, సెప్టెంబర్ 28న ఉదయం 9 గంటలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ నిర్వహిస్తారని, మధ్యాహ్నం మూడు గంటలకు మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశము, సాయంత్రం నాలుగు గంటలకు ధర్మవరం పి ఆర్ టి కాలనీలో మన ఇల్లు మన గౌరవం అనే కార్యక్రమంలో పాల్గొంటారని, సెప్టెంబర్ 20 9వ తేదీన ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు ధర్మవరం విష్ణు ప్రియ రెసిడెన్సిలో ఐఎంఏ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలిపారు. (Story : నేడు ఆరోగ్య శాఖ మంత్రి ధర్మవరం రాక)