వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి : మంత్రి సీతక్క
న్యూస్ తెలుగు /ములుగు :
వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సూచించారు.
బుదవారం ములుగు జిల్లా కేంద్రం లోని గడిగడ్డ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం ను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. తో కలసి సందర్శించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క విద్యార్థులతో మాట్లాడి వసతి, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. చదువు ఎలా సాగుతోందని విద్యార్థులను అడిగారు. మంచి విద్యను అభ్యసించాలని సూచించారు.
భోజనం ఎలా వుంది, అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేకుండా విద్యార్థినులు బయటకు వెళ్తున్నారా అని వార్డను అడిగారు.
ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ విద్యార్థినిలతో కలసి అల్పాహారం చేశారు. అతిథిగా వచ్చి తమతో పాటు కింద కూర్చుని మంత్రి, కలెక్టర్ భోజనం చేయడంతో ఆ విద్యార్థినుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెనూ ప్రకారం అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇస్తున్నారా? లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అల్పాహారం నాణ్యతను పరిశీలించెందుకు విద్యార్థులతో పాటు కింద కూర్చొని వారితో ముచ్చటిస్తూ భోజనం చేశారు. ఉప్మా బాగుందని, రోజూ ఇలాగే మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన అల్పాహారం, భోజనాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు.
హాస్టల్లో ఉన్న ఖాళీ స్థలంలో షెడ్డును (డైనింగ్ హాల్) నిర్మిస్తే విద్యార్థినిలు అల్పాహారం, భోజనం చేసేందుకు అనువుగా ఉంటుందని దసరా సెలవుల్లో షెడ్ నిర్మించాలని మంత్రి తెలిపారు.
అనంతరం మంత్రి ప్రక్కనున్న షెడ్యుల్ కులముల బాలికల వసతి గృహం ను సందర్శించారు. విద్యార్థులను పలుకరించి వారికి అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, రోజువారీ దినచర్య గురించి అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థినిలు భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ లేదని నిర్వాహకులు మంత్రి కి తెలుపగా, ఖాళీ స్థలంలో దసరా సెలవుల్లో షెడ్ (డైనింగ్ హాల్) ను నిర్మించాలని మంత్రి తెలిపారు.
ఇంకనూ ఏమైనా మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నట్లయితే కలెక్టర్ దృష్టికి తీసుకుని రావాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ టి డి ఓ దేశిరాం, జిల్లా షెడ్యూల్ కులాల అధికారి బానోత్ లక్ష్మణ్, డివి హెచ్ ఓ కొమురయ్య, డి డబ్లు ఓ ఇంచార్జీ శిరీష, డి పి ఓ దేవ్ రాజ్,
ఎం.పి.డి. ఓ రామకృష్ణ, తహసిల్దార్ విజయ భాస్కర్, ఐ టి డి ఓ ఎస్ ఓ రాజ్ కుమార్, ఎంపి ఓ రహీం, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి : మంత్రి సీతక్క)