Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ 16, 17 వార్డులలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

16, 17 వార్డులలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

0

16, 17 వార్డులలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

న్యూస్‌తెలుగు/వినుకొండ :  పట్టణంలోని 16, 17 వార్డులలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ” ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదటిగా రెండు వార్డుల్లో అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం తిమ్మాయపాలెం రోడ్ లోని వై కన్వర్షన్ హాల్లో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ప్రజలు ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ ప్రజలను ఆదుకుంటున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత పిలిపించుకుంటుందని అన్నారు. 159 కోట్లతో త్రాగునీటి పథకం పూర్తిచేసి పట్టణ పుర ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించి, త్రాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, బిజెపి టిడిపి జనసేన పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : 16, 17 వార్డులలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version