ఏ.ఐ.ఎస్.ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి
ఏ.ఐ.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు: వి. జాన్సన్ బాబు
న్యూస్‌తెలుగు/విజయనగరం : ఈరోజు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విజయనగరంలో నవంబర్ 27 నుండి 30 వ తారీకు వరకు జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు సంబంధించి కరపత్రాలను ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి. జాన్సన్ బాబు ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వి. జాన్సన్ బాబు మాట్లాడుతూ నాలుగు రోజులు పాటు జరిగే ఈ మహాసభలలో మొదటిరోజు పదివేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహించి మూడు రోజులపాటు ఏఐఎస్ఎఫ్ డెలిగేట్స్ తో చర్చలు జరిపి రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని 32 మంది ప్రాణాలు త్యాగం చేసి ఏర్పాటుచేసిన విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడం దారుణం అన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల సంఖ్యలో ఉపాధి పొందుతున్నారని ప్రభుత్వ పరిశ్రమలు ఏర్పాటు చేయకపోగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను తాకట్టు పెట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ఈ మహాసభలలో తీర్మానం చేసి ఉద్యమాలకు కార్యచరణ రూపొందిస్తామన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విద్యను కాషాయీకరణ , ప్రైవేటీకరణ చేసే విధంగా అడుగులు వేస్తుందని అందులో భాగంగానే నూతన విద్యా విధానం తీసుకొచ్చి విద్యార్థులు పూర్తిగా చదువుకు దూరం అయ్యే విధంగా చేస్తుందని విమర్శించారు. బాల్యం నుండే విద్యార్థుల మెదడులలో మూడ నమ్మకాలు, మతోన్మాదం ఎక్కించే విధంగా వారి విధానాలు ఉన్నాయని దానికి నిదర్శనమే డార్విన్ సిద్ధాంతం పాఠ్యాంశ పుస్తకాల నుండి తొలగించి మహాత్మా గాంధీజీ ని చంపిన గాడ్సే లాంటి వ్యక్తుల జీవిత చరిత్ర పాఠ్యాంశ పుస్తకాలలో నింపుతున్నారని దుయ్యపడ్డారు. అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో సమస్యలతో విద్యాలయాలు ఆహ్వానం పలుకుతున్నాయని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ హాస్టలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం 17 వైద్య కళాశాలలను నిర్మించిందని కానీ ఎన్డీఏ ప్రభుత్వం వాటిని మెరుగుపరిచే విధంగా కాకుండా ఎన్. ఎం .సి రాయలసీమ మెడికల్ కళాశాలలో 50 సీట్లకు అనుమతించిన వాటిని సద్వినియోగం చేసుకోకుండా మేము మెడికల్ కళాశాల ప్రభుత్వంలో నడపలేము మాకు ఆ సీట్లు అవసరం లేదు అని తిరిగి ఒక లెటర్ రాయడాన్ని ఏఐఎస్ఎఫ్ ఖండిస్తుందన్నారు. పేద వైద్య విద్యార్థుల భవిష్యత్ నాశనం చేయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 107,108 రద్దు చేయాలని ఈ 49 వ మహాసభలలో ఈ విషయాలన్నీ చర్చించి రాబోయే రోజుల్లో కార్యాచరణ రూపొందిస్తామని ఈ మహా సభలకు విద్యార్థులు మేధావులు కవులు రచయితలు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభల విజయవంతం అయ్యేలా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు: ఎన్ శ్రీను, యు నాగరాజు, నాయకులు లవ కుమార్, గణేష్, మధు, గ్రేస్ ప్రకాష్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు. (Story : ఏ.ఐ.ఎస్.ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి)