కామ్రేడ్ బర్ధన్ పోరాట జీవితం స్ఫూర్తిదాయకం : సిపిఐ
న్యూస్‌తెలుగు/వనపర్తి : సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ పోరాట జీవితం స్ఫూర్తిదాయకమని సిపిఐ, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు, జిల్లా నేతలు అన్నారు.ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కె.శ్రీరామ్, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. కళావతమ్మ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, సిపిఐ పట్టణ కార్యదర్శి జె.రమేష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి శ్రీహరి, ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ అన్నారు. బుధవారం వనపర్తి సిపిఐ ఆఫీస్ లో కామ్రేడ్ ఏబీ బర్ధన్ జయంతి ఉత్సవాలను సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి, పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మహారాష్ట్ర నాగపూర్ లో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాలకు ఆకర్షితులై కమ్యూనిస్టు పార్టీలో చేరారు అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారన్నారు. అసెంబ్లీలో పేదలు, కార్మికులు,రైతుల గొంతుక అయ్యారన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా సిపిఐ సరైన దిశలో నడిపించారని, త్వరలో సిపిఐ వందేళ్ళ ఆవిర్భావ దినం జరుపుకోబోతోందన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తో ఆయనకు అనుబంధం ఉందన్నారు. ప్రజా పోరాటాలు, ఉద్యమాల్లో 20 సార్లు అరెస్ట్ అయ్యారని, నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించారని, రెండేళ్లు అజ్ఞాత జీవితం గడిపిన పోరాటయోధుడు వర్ధన్ అని కొనియాడారు. ఆయన నిరాడంబర అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఆయన మరణించిన రోజు ఐదు జతల బట్టలు, రెండు జతల బూట్లు, 150 పుస్తకాలు మాత్రమే ఉన్నాయన్నారు. కమ్యూనిస్టుగా ఆయన ఆదర్శ జీవితం అందరికీ మార్గదర్శకం కావాలన్నారు. సిపిఐ, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు చంద్రయ్య,కళావతమ్మ, శ్రీరామ్, రమేష్, శ్రీహరి, గోపాలకృష్ణ, సీఎన్ శెట్టికుతుబ్, ఎత్తం మహేష్, విష్ణు, చందు, తదితరులు పాల్గొన్నారు. (Story : కామ్రేడ్ బర్ధన్ పోరాట జీవితం స్ఫూర్తిదాయకం : సిపిఐ)