గోట్లురు,నాగులూరు గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం
సహాయ వ్యవసాయ సంచాలకులు కృష్ణయ్య
న్యూస్ తెలుగు ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : మండల పరిధిలోని గొట్లూరు, నాగులూరు గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని సహాయ వ్యవసాయ సంచాలకులు రెగ్యులర్ ధర్మవరం కృష్ణయ్య, రైతు శిక్షణ కేంద్రం ఏ డి ఏ విద్యావతి , సెరికల్చర్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గొట్లురు గ్రామానికి చెందిన చెన్నప్ప రైతు పొలాన్ని సందర్శించి వేరుశనగ, కంది పంటలను పరిశీలించడం జరిగింది అని, వేరుశనగ పూత దశలో ఎకరాకు నాలుగు బస్తాలు జిప్సం వేసుకోవాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు. అలాగే కంది పంటలో పూత దశలో పురుగు నివారణ కోసం ఇమామెక్టిన్ బెంజోయేట్ గ్రాము లీటరుకు పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు. సూర్యనారాయణ రైతుకు చెందిన వరి పొలాలను పరిశీలించి, ఆకు ముడుత నివారణకు క్లోరిపైరీఫోస్ 2ఎంఎల్ లీటరుకు పిచికారి చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగిందన్నారు. అలాగే రైతు శిక్షణ కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు విద్యావతి వేరుశనగ పంటలో తీసుకోవాల్సిన మెలకువలు తెలియజేయడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు చురుకుగా పాల్గొని సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అశ్విని , ఎంపీఈఓ నాగార్జున ,శశి పాల్గొన్నారు. (Story : గోట్లురు,నాగులూరు గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం)