కంచరపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
ఇద్దరు యువకులు మృతి..ఒకరికి గాయాలు!
న్యూస్‌తెలుగు/కంచరపాలెం : మంగళవారం ఉదయం 6.15 గంటలకు కంచరపాలెం ఇందిరానగర్ ఎదురుగా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా, ఒక యువకుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఊర్వశి జంక్షన్ వైపు నుండి తాటి చెట్ల పాలెం వైపుA.P40D.k.9061 నెంబర్ గల రేష్ బండిపై ముగ్గురు యువకులు అతివేగంతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుకుంటున్నారు. అయితే మృతి చెందిన యువకుల్లో ఒక యువకుడి గుండె భాగం బయటికి వచ్చేసింది. మరో యువకుడు తలపగిలి మృతి చెందాడు. ఒకే బండి పై అతివేగంతో వెళ్తున్న ముగ్గురు యువకుల్లో ఒక యువకుడు తీవ్ర గాయాల పాలై రోడ్డుపై పడి ఉండడంతో వెంటనే స్థానికులు అంబులెన్స్ కుఫోన్ చేయడంతో క్షణాల్లో అంబులెన్సర్ చేరుకుని ఆ యువకుడికి ప్రథమ చికిత్స చేపట్టింది. ఇదిలా ఉండగా రేస్ బండిపై వస్తున్న యువకుల వాహనాన్ని ఏదైనా వాహనం ఢీ కొట్టిందా? లేదా యువకులే అతివేగంతో వచ్చి డివైడర్ను ఢీకొంటున్నారా? అన్నది ప్రశ్న అర్థం గా మిగిలింది. అంతేకాకుండా యువకులు మృతి చెంది ఉన్న స్థలానికి వీరు వాహనం కుమార్ అరకు కిలోమీటర్ దూరంలో డివైడర్ను ఢీకొని పడి ఉంది. వాహనానికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆ వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు లో ఇద్దరు మృతిచెందగా ఒక యువకుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఈ రోడ్డు ప్రమాదం ఓ పెద్ద చర్చనీయాంశంగామారింది. పోలీసులు రంగ ప్రవేశం చేస్తే, మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ముగ్గురి యువకులు కంచరపాలెం సమీపానగలకప్పరాడకు చెందిన వారిని తెలిసింది.