మహిళల కోసం కోర్టెవా అగ్రిసైన్స్ బోల్డ్ న్యూ ప్రోగ్రాం
న్యూస్‌తెలుగు/న్యూఢిల్లీ: అంతర్జాతీయ వ్యవసాయ లీడర్ కోర్టెవా అగ్రిసైన్స్ భారతదేశంలో అగ్రి-వేల్యూ చెయిన్‌లో 2030 నాటికి రెండు మిలియన్ వుమెన్ (మహిళలకు) మద్దతు ఇవ్వడానికి సమగ్రమైన ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తోంది. లక్ష్యభరితమైన మద్దతు, సాధనాలు మరియు వ్యవస్థలను కేటాయించడం ద్వారా, కోర్టెవా మహిళలను రైతులు, పరిశోధకులు మరియు ఔత్సాహికులుగా ప్రారంభించే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఈ చొరవ వనరులను సమానంగా పొందడం, నిర్ణయాలు చేసే బాధ్యతలను ప్రోత్సహిస్తుంది, ఉత్పాదకతను మెరుగుపరిచే టెక్నిక్స్‌ను మెరుగుపరుస్తుంది. ఆహార భద్రతను పెంచుతోంది. ఈ ప్రోగ్రాం సంప్రదాయబద్ధమైన కార్పొరేట్ బాధ్యతను అధిగమించింది, లింగ సమానత్వాన్ని సమీకృతం చేసే ఉద్యమాన్ని, సుస్థిరమైన అభివృద్ధి, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తోందని సుబ్రొటో గీడ్- దక్షిణాసియా ప్రెసిడెంట్, కోర్టెవా అగ్రిసైన్స్ అన్నారు. 2 మిలియన్ చొరవ మహిళలకు లింగ సమానత్వాన్ని, ఆర్థికాభివృద్ధిని, పర్యావరణ సుస్థిరతను కలుపుతుందని కోర్టెవా అగ్రిసైన్స్ ఇండస్ట్రీ వ్యవహారాల డైరెక్టర్ (ఆసియా పసిఫిక్) అనుజ కడియన్ అన్నారు. (Story :మహిళల కోసం కోర్టెవా అగ్రిసైన్స్ బోల్డ్ న్యూ ప్రోగ్రాం)

