UA-35385725-1 UA-35385725-1

పుష్ప-2 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

పుష్ప-2 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 దిరూల్‌..!

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా : ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి పుష్ప-2 దిరూల్‌ మీదే. ఈ సినిమాకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా భారతీయ సినీ పరిశ్రమ యావత్‌ ఎదురుచూస్తున్న సినిమా ఇది. అది మన తెలుగు సినిమా కావడం గర్వకారణం. ఇక ‘పుష్ప-2’ ది రూల్‌..  డిసెంబరు 6న ప్రారంభం కానున్న పుష్పరాజ్‌ రూల్‌కు కౌంట్‌స్టార్‌ అయ్యింది. మరో 75 రోజుల్లో అంటే డిసెంబరు 6న పుష్ప-2 రూల్‌ బాక్సాఫీస్‌పై ప్రారంభం కానుంది.  ప్రతి సీన్‌కు గూజ్‌బంప్స్‌తో పాటు పుష్ప ది రూల్‌కు అందరూ ఫిదా అయిపోవాల్సిందే అంటున్నారు చిత్ర మేకర్స్‌.  పుష్ప దిరైజ్‌తో బార్డర్‌లు దాటిన  ఇమేజ్‌తో.. అద్వితీయమైన నటనతో..
ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయని క్రేజ్‌తో దూసుకపోతున్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప-2’లో  మైస్మరైజింగ్‌ నటన కోసం, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ టేకింగ్‌..మేకింగ్‌.. కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల పతాకంపై ప్రముఖ నిర్మాతలు, నవీన్ ఏర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు సాంగ్స్‌, టీజర్‌కు ఎంతటి అనూహ్యమైన స్పందన వచ్చిందో తెలిసిందే. దేవి శ్రీప్రసాద్‌ అందించిన అందించిన ట్రెండీ పాటలకు అద్వితీయమైన స్పందన వచ్చింది. ఇక పుష్ప-2 ది రూల్‌ నుండి రానున్న ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా అంతే క్రేజీతో రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో వున్న ఈ చిత్రం, మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. కంటెంట్‌ పరంగానే కాకుండా టెక్నికల్‌గా కూడా పుష్ప-2 అత్యున్నత స్థాయిలో వుండబోతుంది. మీరు ఎంత ఎక్స్‌పెక్ట్‌ చేసిన అంతకు మించి తగ్గేదేలేలా పుష్ప-2 వుండబోతుందని హింట్‌ ఇస్తున్నారు మేకర్స్‌… ఇక డిసెంబరు 6న అందరూ పుష్ప ది రూల్‌ డే అని ఎదురుచూస్తున్నారు.. నో డౌట్‌ ఈసారి అస్సలు తగ్గేదెలే…..
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్– (Story : పుష్ప-2 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1