పెరుమాళ్ళపల్లి గ్రామ మహిళలకు స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమం
న్యూస్‌తెలుగు/ తిరుపతి : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం,మహిళ అధ్యయన కేంద్రం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్.డి.ఉమాదేవి 23-09-2024వ తేదీన స్వచ్ఛతా హి సేవ 2024 క్యాంపియన్ సందర్భంగా పెరుమాళ్ళపల్లి గ్రామ మహిళలకు స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు..ఈ కార్యక్రమంలో డాక్టర్ డి ఉమాదేవి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలిని నడిపించడానికి పరిశుభ్రత చాలా ముఖ్యమని అది మనకు మన ఇంటి వరకే పరిమితం కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యమని స్వచ్ఛమైన పచ్చదనంతో నిండి ఉన్న భారతదేశాన్ని రూపొందించడంలో మన వంతు చిన్న పాత్రను పోషించాలని అది ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించినప్పుడే సాధ్యమవుతుందని, ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిళా అధ్యయన కేంద్ర ప్రాజెక్టు అసిస్టెంట్ డాక్టర్ ఎం. ఇంద్రాణి మరియు మహిళలు పాల్గొన్నారు. (Story : పెరుమాళ్ళపల్లి గ్రామ మహిళలకు స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమం)