Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

0

పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

న్యూస్‌తెలుగు/ వినుకొండ : “స్వభావ స్వచ్ఛతా- సంస్కార్ స్వచ్ఛతా” అన్న నినాదంతో స్వచ్ఛతాహి సేవా 2024 కార్యక్రమంలో భాగంగా సోమవారం పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించు కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యులు మక్కెన మల్లికార్జున రావు , షకీలా దస్తగిరి, మునిసిపల్ కమీషనర్ ఎం.సుభాష్ చంద్రబోస్ , కమ్యునిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండ్ డా.రజాక్ , టౌన్ టీడీపీ పార్టీ అధ్యక్షులు ఆయుబ్ఖాన్ ,రాష్ట్ర మైనారిటీ సెల్ టీడీపీ కార్యదర్శి సౌదాగర్ జానీ , రాష్ట్ర టీడీపీ పార్టీ కార్యదర్శి షమీమ్ ఖాన్, పీవీ.సురేష్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ. పారిశుధ్యం యొక్క ప్రాశస్త్యాన్ని ,సమాజము యొక్క ఆరోగ్యాన్ని పారిశుధ్య కార్మికులు ఎలా మెరుగుపరుస్తున్నారు అని కార్మికుల సేవలను కొనియాడారు. కమీషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ విజయవాడలో వరదలకు బురదమయం అయిన ఇళ్లను వీధులను వినుకొండ పారిశుధ్య కార్మికులు ఎలా శుభ్రం చేశారో వినుకొండ పారిశుధ్య కార్మికుల అంకితభావం ఏపాటిదో వివరిస్తూ వారి సేవలకు గాను ధన్యవాదాలు తెలుపుతూ పారిశుధ్య కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం మునిసిపల్ కార్యాలయం భాద్యత అని భరోసా ఇచ్చారు. (Story : పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version