రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి
ఈ క్రాప్ నమోదుకు గడువు పెంచాలి
ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో ఎరువుల సరఫరా పై సమీక్ష సమావేశం ఏ డి ఏ బోయపాటి రవిబాబు అధ్యక్షతన నిర్వహించగా ఎరువుల డీలర్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వంలో రైతులకు ఎరువులు యంత్ర పరికరాలు అందుబాటులో లేవని, రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులు స్వేచ్ఛగా పంటలు సాగు చేసుకొని మంచి దిగుబడును సాధించేందుకు సహకరించాలని కోరారు. ఎరువుల డీలర్లు, రిటైర్ షాప్ లో యజమానులు అధిక ధరలకు ఎరువులు విక్రయించిన, ఎరువులు కృత్రిమ కొరత సృష్టించిన సహించేది లేదని హెచ్చరించారు. ఇటీవల రైతులు తనను కలిసి ఈ క్రాప్ నమోదుకు గడువు పెంచమని కోరినట్లు ఏడిఏ కి ఎమ్మెల్యే తెలిపారు. ఈ క్రాఫ్ట్ నమోదుకు గడువును పెంచి ప్రతి ఎకరా ఈ క్రాప్ లో నమోదుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశించారు. రైతులు బాగుంటేనే డీలర్లు ప్రజలు బాగుంటారని, కాబట్టి రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యాపారులు వ్యవహరించవద్దని సూచించారు. రైతులకు అవసరమైన మేర ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి, ఐదు మండలాల ఏవోలు, వినుకొండ పట్టణంతో పాటు, నియోజకవర్గంలోని ఫర్టిలైజర్స్ వ్యాపారులు, డీలర్లు పాల్గొన్నారు. (Story : రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి)