పరిశుభ్రమైన భారతావని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి
అదనపు కలక్టర్ సంచిత్
న్యూస్‌తెలుగు/వనపర్తి : మహాత్మా గాంధీ పోరాటం చేసి భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్దెంచేలా కృషి చేశారని సిద్ధించిన భారత దేశం స్వచ్చంగా పరిశుభ్రంగా ఉండాలని కోరుకున్నారని అన్నారు. గాంధీ కలలు కన్న స్వచ్చమైన భారత దేశాన్ని నిర్మించెంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశమంతటా స్వచ్చత హీ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ, సెల్ఫి స్టాండ్ ప్రారంభోత్సవం చేశారు. అదనపు కలక్టర్ తొలి సంతకం చేసి స్వచ్చత హి సేవా లో సెల్ఫీ ఫోటో దిగారు. అనంతరం అధికారులు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు వారంలో రెండు గంటలు చొప్పున సంవత్సరానికి 100 గంటలు పరిసరాల పరిశుభ్రతకు కేటాయించి తన పరిసరాలను, తద్వారా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచటంలో తనవంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు.
జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : పరిశుభ్రమైన భారతావని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి )