అభ్యంతరాల నమోదు స్వీకరణ పరిశీలన
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు జరిరగిన నష్ట గణపై అభ్యంతరాలు నమోదు, అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర సోమవారం పరిశీలించారు. కమిషనర్ నగర పర్యటనలో భాగంగా సోమవారం కండ్రిక, శాంతినగర్, అయోధ్య నగర్, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రభావితమైన ప్రాంతాల్లోని సచివాలయాన్ని సందర్శించి, సచివాలయంలో సిబ్బంది అభ్యంతరాలు నమోదు చేస్తున్న పనితీరును పరిశీలించి తానే స్వయంగా నమోదును ఎలా స్వీకరించాలో చేసి చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాలైన 32 వార్డుల్లోని అన్ని సచివాలయాల్లో కూడా ఇప్పటివరకు వచ్చిన నష్టగణన లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించిన తర్వాత వాటిపై అభ్యంతరాల నమోదులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అలా ప్రజల దగ్గర నుండి వస్తున్న అభ్యంతరాలు నమోదులను ఆదివారం నుండి స్వీకరిస్తున్నారని, నగర పాలక సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఆఫీసర్, జిల్లా నుండి వచ్చిన జిల్లా ఆఫీసర్ ప్రజల సమక్షంలో వినతులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ శుభం నోఖ్వాల్ తదితతరులు పాల్గొన్నారు. (Story: అభ్యంతరాల నమోదు స్వీకరణ పరిశీలన)