రైతాంగ, కార్మిక హక్కులను కాల రాస్తున్న బిజెపి
న్యూస్‌తెలుగు/వినుకొండ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశానికి పట్టెడన్నం పెడుతున్న రైతాంగాన్ని కష్టపడి కాయ కష్టం చేసి సంపదను సృష్టిస్తున్న కార్మికుల హక్కులను కాలరాస్తోందని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, రైతు సంఘం నాయకులు గోపాల్ అన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా సిఐటియు, ఏఐటియుసి నాయకులు కొత్తపల్లి హనుమంత రెడ్డి, బూదాల శ్రీనివాసరావు లు అధ్యక్షత వహించి రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ అధికారం వెలగబెడుతూ తాను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తానని, రైతాంగానికి గిట్టుబాటు ధరను ఒకటిన్నర రెట్లు పెంచి ఇస్తానని, ప్రతి పేదవాని బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని, విభజన హామీలు అమలు చేస్తానని విశాఖ రైల్వే జోన్ ఇస్తానని అమరావతిని ఢిల్లీని తలదన్నే రాజధానిని చేస్తానని దేశ ప్రజలకు మన రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆడిన మాట తప్పి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని అన్నారు. దేశంలో ధరలు విపరీతంగా పెంచారని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి వేసివేరని సామాన్యుడు వాడుకునే నిత్య అవసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని విశాఖ రైల్వే జోన్ దేవుడెరుగు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు దశలవారీగా అమ్మ చూపుతున్నారని దీన్ని రాష్ట్ర ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికిని బడా పెట్టుబడిదారుల లాభార్జన ధ్యేయంగా అంబానీ, అదానీ లాంటి కోటీశ్వరులకు దేశ సంపదను పరిశ్రమలను ప్రభుత్వ రంగ సంస్థలను అప్పచెప్పుతున్నారని కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లుగా తగ్గించి కార్మిక హక్కులను కాల రాస్తున్నారని దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు మొండి చేయి చూపిస్తున్నారని కార్పొరేట్ శక్తుల కొమ్ముగాసే నరేంద్ర మోడీ విధానాలను తిప్పి కొట్టాలని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు కే. హనుమంత రెడ్డి, సిపిఎం బొంకూరి వెంకటేశ్వర్లు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు రాయబారం వందనం, షేక్ కిషోర్, సోడాల సాంబయ్య, కే. మల్లికార్జునరావు, వెంకటప్పయ్య, రంజాన్ బి, తదితరులు పాల్గొన్నారు. (Story : రైతాంగ, కార్మిక హక్కులను కాల రాస్తున్న బిజెపి)