స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోర్టు నడిపించాలి
*ఏ పి ఓ కు వినతిపత్రం అందించిన ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి
*గ్రీవెన్స్ లో వివిధ శాఖల అధికారుల గైర్హాజర్ పైన అసహనం వ్యక్తం
న్యూస్ తెలుగు /ములుగు : ఆదిమ తెగల సర్వతో ముఖాభివృద్ధికి పాటు పడాల్సిన ఏటూరునాగారం సమగ్ర గిరిజనాభి వృద్ధి సంస్థ,గిరిజనేతరులకు కొమ్ము కాస్తోందని, ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి విమర్శించించారు. సోమవారం గిరిజన దర్భార్ లో పలు సమస్యల పైన సహాయ ప్రాజెక్ట్ అధికారి భీమ్ రావు కు నర్సింహా మూర్తి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గిరిజనుల భూములను, ఎల్ టి ఆర్ చట్టాన్ని, రక్షించడానికి ఏర్పాటు చేసిన, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోర్టు ను సక్రమంగా నడిపించాలని వినతిపత్రం లో పేర్కొన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోర్టు ను నడిపించక పోవడం కారణంగా, గిరిజన ప్రాంత భూములు, గిరిజనుల భూములు వలస గిరిజనేతరుల హస్తగతం అవుతున్నాయని తెలిపారు. గిరిజనులకు న్యాయ, సహాయం అందించేందుకే ఎస్ డి సి కోర్టు ఉన్నప్పటికీ,రాజకీయ జోక్యం తో ఆ లక్ష్యం గా,నీరుగారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు . వేసిన కేసుల పైన విచారణ జరపాలని కోరారు. గిరిజన తెగల ఉపాధికి, ఐటీడీ ఏ అధికారులు గండి కొడుతూ ఉన్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఆదిమ తెగల్లో నిరక్ష రాస్యత, నిరుద్యోగం రాజ్యమేలు తోందని అన్నారు . ఉపాధి అవకాశాలు లేక వలస బాట పడుతున్నట్లు తెలిపారు. గ్రేవెన్స్ లో వివిధ శాఖల అధికారులు లేకపోవడం పైన ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఐటీడీ ఏ అధికారుల్లో క్రమశిక్షణ, బాధ్యత కొరవడినాయని అన్నారు. గిరిజనుల పైన చిత్త శుద్ధి అధికారుల్లో ఏ మాత్రం లేదన్నారు. గ్రీవెన్స్ కు వచ్చిన గిరిజనులు, వివిధ శాఖల అధికారులు లేకపోవడం తో అయోమయానికి గురైనట్లు తెలిపారు. జిల్లా గిరిజన మంత్రి ఉన్న చోట ఈ విధంగా జరగడం హాస్యాస్పదం గా ఉందన్నారు. గిరిజన మంత్రి సీతక్క ఏటూరునాగారం ఐటీడీఏ ను ప్రక్షాళన చేసి బాగు చేయాలని, ఐటీడీఏ పాలక మండలి సమావేశాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా కోరారు ఈ కార్యక్రమం లో మహేష్, కృష్ణమూర్తి, రవి తదితరులు పాల్గొన్నారు. (Story : స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోర్టు నడిపించాలి)