తొలి ఏకాదశి సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన భక్త బృందం ఆలయ నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో ఆదివారం తొలి ఏకాదశి పండుగ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వర్షాలు విస్తారంగా కురవాలని శ్రీశైలం సాగరు డ్యాములు నీళ్లతో నిండాలని, రైతులకు కాలువల ద్వారా పంటలకు నీళ్లు రావాలని సంకల్పం చేయడం జరిగింది. ఆ సంకల్పం నెరవేరిన శుభ సందర్భంగా ఆదివారం వినుకొండ నుండి శ్రీశైలం వరకు మహా పాదయాత్ర కార్యక్రమాన్ని ఆలయ గౌరవ సేవకులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాజుల మాల్యాద్రి, బద్దిక నరసింహారావు, వెంకటేశ్వర్లు, అనుముల రామకృష్ణ, సరోజనమ్మ, కృష్ణవేణి, 21 మంది భక్త బృందం ఈ మహా పాదయాత్రలో పాల్గొన్నారు. , (Story ; తొలి ఏకాదశి సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు)