ఎస్ జి ఎఫ్ నియోజకవర్గం పోటీలు
ఎంఈఓ లు గోపాల్, నాయక్ రాజేశ్వరి దేవి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే నియోజకవర్గ పోటీలను ఈనెల 25, 26 వా తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తామని ఎంఈఓ లు గోపాల్ నాయక్ , రాజేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ శైలజ ఆధ్వర్యంలో ఈ ప్రకటన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 25వ తేదీన కోకో, కబడ్డీ, వాలీబాల్, యోగ, బ్యాడ్మింటన్, చెస్, 26వ తేదీన అథెంటిక్స్ నందు పరుగు పందెం, జావలిన్ త్రో, షాట్ పుట్, హై జంప్, లాంగ్ జంప్ తదితర పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు మండల స్థాయిలో ఎంపికైన వారు మాత్రమే అర్హులని తెలిపారు. ఈ నియోజకవర్గ స్థాయి పోటీలకు నియోజకవర్గంలోని వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ నాగేంద్ర మండల కోఆర్డినేటర్ రఘునాథ రావు పాల్గొన్నారు. (Story : ఎస్ జి ఎఫ్ నియోజకవర్గం పోటీలు)