స్ట్రీట్ లైట్లపై మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ పట్టణంలో స్ట్రీట్ లైట్లపై మున్సిపల్ కమిషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అన్ని వార్డుల్లో స్ట్రీట్ లైట్లు, ప్రధాన సెంటర్లలో మెర్క్యూరీ లాంప్స్, డివైడర్లపై ఆగిపోయిన లైట్లను వెలిగిస్తున్నారు. విజయవాడ నుండి టెక్నీషియన్స్ ను పిలిపించి లైట్లు వెలగనిచోట్ల అవి తీసేసి కొత్త లైట్లు వేసేందుకు చర్యలు చేపడుతున్నారు. 80. 40. 20 వాట్స్ సామర్థ్యం గల బల్బులను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. విజయవాడలో పనిచేసి వచ్చిన కమిషనర్ ఎం చంద్రబోస్. వినుకొండ పట్టణం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రధానంగా పారిశుద్ధ్యం. ట్రాఫిక్ సమస్య. పట్టణంలో ఏ వీధిలో చూసినా చీకటి లేకుండా ఉండేటట్లుగా స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. పట్టణంలో రాత్రులందు ఎక్కడ చూసినా. వెలుగులు కనిపించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. (Story : స్ట్రీట్ లైట్లపై మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి)