అమ్మవారి పందిరి రాటకు శ్రీకారం
న్యూస్‌తెలుగు/ విజయనగరం : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈనెల 30నుండి జరుగుతున్న నేపథ్యంలో మూడు లాంతర్లు దరి చదురుగుడివద్ద ఉదయం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన పందిరి రాట కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూజలు నిర్వహించి పందిరిరాటతో వేసి ఉత్సవాలు కు శ్రీకారం చుట్టారు.ఈకార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు, దేవస్థానం ఇఓ డివివి ప్రసాదరావు, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి , మాజీ ఎంఎల్ సి గాదె శ్రీనివాసులు నాయుడువేదపండితులు,అవనాపువిజయ్ ,దేవస్థానంసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.అలాగే వనంగుడి వద్ద కూడా పందిరిరాట వేసారు.అంతకుముందు చదురుగుడిలో అమ్మవారి దీక్షా ధారులకు అర్చకులు పూజలు నిర్వహించి అమ్మవారి చెంత ఉంచిన దీక్షా మాలలు అర్చకులు, వేదపండితులు,భక్తులకు ఇఓ ప్రసాదరావు ద్వారా అందజేశారు. అమ్మవారి ఉత్సవ విశేషాలు ఇఓ భక్తులకు తెలిపారు.ఆలయం ప్రాంగణంలో గల భవనం లో మండలదీక్షాశిబిరంలో అమ్మవారి కి పూజలు నిర్వహించారు.భక్తులు జైపైడిమాంబ జయనాదాలుచేసారు. (Story : అమ్మవారి పందిరి రాటకు శ్రీకారం)