అన్న క్యాంటీన్లో సమస్యలు లేకుండా చూడండి
నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/`విజయవాడ : నగరంలో నిర్వహిస్తోన్న అన్న క్యాంటీన్లలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర ఆదేశించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కమిషనర్ శుక్రవారం అన్న క్యాంటీన్ల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. నగరంలో ఉన్న 11 అన్న క్యాంటీన్లకు ప్రతి ఒక్క క్యాంటీన్‌కి ఒక స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న ఆఫీసర్లతో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి అన్న క్యాంటీన్‌లో ఆహారంలో నాణ్యత, పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, ఫుడ్ టోకెన్ల వివరాలు, మరుగుదొడ్ల నిర్వహణ అంశాలపై సమీక్షించారు. ప్రతి అన్న క్యాంటీన్‌లో స్పెషల్ ఆఫీసర్ గమనించిన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకునేలా ప్రణాళికను సిద్ధం చేసి తక్షణం ఆయా సమస్యను పరిష్కరించేలా ఈ సమావేశంలో నిర్ణయించారు. అన్న క్యాంటీన్లలో ఏ సమస్య వచ్చినా వెంటనే 15 నిమిషాల్లో ఆ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. (Story : అన్న క్యాంటీన్లో సమస్యలు లేకుండా చూడండి)