టీటీ, షూటింగ్ బాల్ పోటీలకు ప్రభుత్వ స్కూలు విద్యార్థులు
హెడ్మాస్టర్ శైలజ
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : అండర్ 19 విభాగం బాలుర ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో జరిగే టేబుల్ టెన్నిస్, అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన షూటింగ్ బాల్ విభాగములు ఉమ్మడి జిల్లా స్థాయిలో జరిగిన ఎంపికలో టేబుల్ టెన్నిస్ విభాగంలో పవన్ కుమార్ షూటింగ్ బాల్ విభాగంలో చరణ్ కుమార్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ శైలజా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు కర్నూలు నందు జరిగే పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయిలో కూడా నైపుణ్యాన్ని కదపరిచి అర్హత సాధించాలని వారు తెలిపారు. అనంతరం హెడ్మాస్టర్ శైలజా తో పాటు హిందీ పండిట్ వేణుగోపాల్, వ్యాయామ ఉపాధ్యాయుడు నాగేంద్ర, పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. హెడ్మాస్టర్ శైలజా, హిందీ పండిట్ వేణుగోపాల్, వ్యాయామ ఉపాధ్యాయుడు నాగేంద్ర,