వివోఎల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కు వినతి
న్యూస్తెలుగు/ కొమురం భీం /ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూర్ మండలం ఐకెపి సెర్ప్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వివో ఏల సమస్యలు పరిష్కరించాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. గత 20 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నామని, ప్రస్తుతం కేవలం 5000 రూపాయలు మాత్రమే గౌరవ వేతనం చెల్లిస్తున్నారని నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురిని విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు డి ఆర్ డి ఓ దత్తుతో చారవాణిలో మాట్లాడి సమస్య పరిష్కరించాలని తెలిపారు. (Story : వివోఎల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కు వినతి)