పారిశుధ్య కార్మికులు ఆరోగ్యమే నగర ఆరోగ్యం
నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే నగరం పరిశుభ్రంగా, అందంగా, ఆరోగ్యంగా ఉంటుందని నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర అన్నారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మాకినేని బసవ పున్నయ్య స్టేడియంతో పాటు 40 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో 3 వేలకుపైగా పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య శింభిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం పగలు రాత్రి శ్రమించే పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సఫాయిమిత్ర సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిభిరంలో పారిశుధ్య కార్మికులుకు డాక్టర్లు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన కార్మికులుకు రక్త పరీక్షలు, మధుమేహం, థైరాయిడ్ తదితర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. (Story : పారిశుధ్య కార్మికులు ఆరోగ్యమే నగర ఆరోగ్యం )