చేనేత పరిశ్రమను కాపాడాలని ఆర్డిఓకు వినతి పత్రం
న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పవర్ లూమ్స్ వారి నుండి చేనేత పరిశ్రమని కాపాడాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ చేనేత కార్మిక పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నాయకులు ఆర్డీవో వెంకటశివ రామిరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ శ్రీ సత్య జిల్లా ధర్మవరంలో చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘించి, విచ్చలవిడిగా పవర్ లూమ్స్ లో పట్టు చీరలు తయారు చేస్తున్నారు అని, కానీ రిజర్వేషన్ చట్టాన్ని కాపాడాల్సిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి, చేనేత కార్మికుల కష్టానికి శాపంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పట్టణంలో చేనేత కార్మికులు గిట్టుబాటు ధరలు లేక, పెరిగిన ధరలతో కుటుంబాన్ని పోషించలేక పురుగుల మందు త్రాగి ఉరి వేసుకుని, ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని, ఆత్మహత్యలన్నీ కూడా జౌళి శాఖ ఎన్పోస్ట్ మెంట్ నిఘ వైఫల్యమే అని వారు మండిపడ్డారు. ఇప్పటికే పట్టణంలో ఒకే బిల్డింగ్ లో 100 నుంచి 200 వరకు పవర్ లూమ్స్ మగ్గాలను నడుపుతున్నారంటే సంబంధిత అధికార యంత్రాంగం ఎంతవరకు వైలేషన్ జరగకుండా అడ్డుకుంటున్నారు అనేది అర్థమవుతుంది అని స్పష్టం చేశారు. ఇప్పటివరకు పట్టణంలో చేనేత బకాసులను వదిలేసి, ఒకటి రెండు పౌలుసు మగ్గాలు నేస్తున్న యజమానులపై కేసులు పెట్టి తూతూ మంత్రంగా చేతులు దులుపుకుంటున్నారే తప్ప, చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలు కానివ్వకుండా అడ్డుకుంటున్న బడా బాబులపై ఎలాంటి కేసులో నమోదు చేయకపోవడంపై అధికారులు శీతకన్ను చూపిస్తున్నారనేది దీనికి నిదర్శనం అని అన్నారు. పవర్ లూమ్స్ మగ్గాల నుండి చేనేత పరిశ్రమను కాపాడాలని, అలాగే ఎంపోస్మెంట్ ఆఫీస్ ధర్మవరంలో ఏర్పాటు చేయాలని, ఇప్పటికే జె ఆర్ సిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని, 2019 లేబర్ యాక్ట్ ప్రకారం స్థానికంగా ఉన్న కార్మికులకు 75 శాతము మంది కార్మికులకు ఉపాధి కల్పించాలి అని డిమాండ్ చేశారు. ఆ యాజమాన్యం ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను తీసుకువచ్చి ఉపాధి కల్పించడం పద్ధతి కాదన్నారు. అక్కడ చట్ట విరుద్ధంగా కూడా పవర్ లూమ్స్ లో పట్టు చీరలు నేస్తున్న విషయాన్ని బయటకు వస్తుందని ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల కార్మికులకు అక్కడ పని కల్పించారు అని తెలిపారు.ఇప్పటికైనా జెఆర్ సిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ పై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో వెంకట శివారెడ్డి విన్నవించడం జరిగింది అని తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ తప్పకుండా ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ధర్మవరం పిలిపించి, మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు అలాగే చేనేత పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన వేల్పుమడుగు వద్ద గల జేఆర్ సిల్క్ ఫ్యాక్టరీ ని ముట్టడిస్తామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చేనేత పరిరక్షణ కమిటీ నాయకులు వెంకటస్వామి, రవికుమార్, రమణ, వెంకటస్వామి, ఆదినారాయణ, హరి, చెన్నంపల్లి శ్రీనివాసులు, చట్టా రవి, పాలగిరి శ్రీధర్, చట్ట గంగాధర, శ్రీనివాసులు, సురేష్, బాల రంగయ్య, చేనేత కార్మికులు పాల్గొన్నారు. (Story : చేనేత పరిశ్రమను కాపాడాలని ఆర్డిఓకు వినతి పత్రం)