రుణాలు రీ షెడ్యూల్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ఆర్ధికశాఖ అదనపు కార్యదర్శి జే.నివాస్
న్యూస్ తెలుగు/`విజయవాడ : వరద బాదిత ప్రాంత ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చి కల్పించిన రుణాలు రీ షెడ్యూల్ సౌకర్యాన్ని బాదితులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్ధికశాఖ అదనపు కార్యదర్శి జే.నివాస్ సూచించారు. లీడ్ బ్యాంక్ యూబీఐ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నివాస్, జిల్లా కలెక్టర్ సృజన, బ్యాంకర్లు, బీమీ సంస్థల ప్రతినిదులతో గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు ప్రభావంతో కష్టాల్లో ఉన్న బాదితులకు భరోసా కల్పించేలా, విశ్వాసం పెంపొందించేలా బ్యాంకులు నగరంలోని 179 సచివాలయాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు సేవలతందించాలన్నారు. ఏడాది మారటోరియంతో పాటు రుణాల రీషెడ్యూలింగ్‌తో పాటు ముంపు బారిన పడిన గ్రౌండ్ ప్లోర్, కుటుంబాలకు రూ.50వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉన్న వారికి రూ.25వేలు వినిఓగ రుణాలు మంఊరు చేయవచ్చన్నారు. రుణాలకు మూడు నెలలు మారటోరియం, 36నెలలు రీపేమెంట్ పీరియడ్ వర్తిస్తుందన్నారు. చిన్న వ్యాపార, వాణిజ్య సంస్థల అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి కోసం కొత్త రుణాలు కూడా మంజూరు చేయవచ్చన్నారు. సహజ విపత్తు ప్రభావిత జిల్లాకు ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం అందించాల్సిన అన్ని సహాయ సహకారాలనూ అందించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. బల్క్ మేసేజ్‌లతో పాటు నేరుగా కూడా మాట్లాడి బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకునేలా వరద ప్రాంత ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. నీట మునిగిన మొదటి ప్లోర్‌కు రూ.25వేలు, ఆపై అంతస్తుల్లోని ఒక్కో కుటుంబానికి రూ.10వేలు పరిహారాన్ని సీఎం ప్రకటించినట్లు తెలిపారని, దీనికి తోడు రుణాల రీషెడ్యూల్, వినియోగ, కొత్త రుణాల మంజూరుతో బాతుల కష్టాలను గట్టెక్కించవచ్చన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ సమిష్టి కృషితో బాదితులకు చేయూత నందించాలని, అందుకు యంత్రాంగం అన్ని విదాలా సహకారం అందిస్తోందన్నారు. దీనికి బ్యాంకులు తోడై సమిష్టి కృషితో బాదితులకు చేయూత నిందించాల్సిన అవసరముందని సూచించారు. ఈ సమావేశంలో యూబీఐ రీజనల్ హెడ్ శ్రీధర్Ñ ఎల్‌డీఎం ప్రియాంక, వివిధ భ్యాంకులు, భీమీ సంస్థల ప్రతినిదులు పాల్గొన్నారు. (Story : రుణాలు రీ షెడ్యూల్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి)