పార్టీ పరిస్థితులపై మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలతో భేటీ
న్యూస్ తెలుగు / సాలూరు: పార్వతీపురం మణ్యం జిల్లా వైసీపీ నేతలతో రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం భేటీ నిర్వహించారు . ఈ భేటీలో అరకు ఎంపీ తనూజరాణి , ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గండికోట శ్రీకాంత్ సజ్జల రామకృష్ణారెడ్డి మాజీ డిప్యూటీ సీఎం లు పీడిక రాజన్న దొర. పాముల పుష్ప శ్రీవాణి పార్వతిపురం పాలకొండ మాజీ ఎమ్మెల్యేలు అలజింగి జోగారావు విశ్వేశ్వరాయ కళావతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పార్వతిపురం మన్యం జిల్లా వైయస్సార్ పార్టీ అధ్యక్షులు పరిషత్ రాజు ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా పార్టీ పరిస్థితులు పార్టీ నిర్మాణం పై సుదీర్ఘంగా చర్చించి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. (Story : పార్టీ పరిస్థితులపై మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలతో భేటీ)