UA-35385725-1 UA-35385725-1

పేదల ఆకలి తీర్చడానికే డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్

పేదల ఆకలి తీర్చడానికే డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్

ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి.

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) :పేద ప్రజల ఆకలి తీర్చడానికే డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగిందని ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కన గల అన్న క్యాంటీన్, ఎల్పీ సర్కిల్లో గల అన్నా క్యాంటీన్ రెండింటిని వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సత్య కుమార్ యాదవ్ పరిటాల శ్రీరామ్ చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వములో మూతబడిన ఈ అన్నా క్యాంటీన్ తిరిగి పునః ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమని, పేద ప్రజలకు ఇది ఒక వరంలాగా మారిందని తెలిపారు. కేవలం ఐదు రూపాయలకే టిఫిన్ రెండు పూటలా భోజనాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి సమయాలలో ఈ అవకాశముంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు వందలకు పైగా డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని, వందల సంఖ్యలో పేద ప్రజలు తమ ఆకలిని తీర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. సూచి శుభ్రత రుచి కలిగిన నాణ్యమైన భోజనాన్ని అందించడం కూడా జరుగుతోందని తెలిపారు. ఇటువంటి క్యాంటీన్లు ఏర్పాటు పట్ల కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్ష, కోరిక,గెలుపు మేరకే ఈ ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం జరిగిందని, అదేవిధంగా ఈ అన్నా క్యాంటీన్ కి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ అన్న నామకరణం చేయడం కూడా శుభ పరిణామం అని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు హరీష్, జింక రామాంజనేయులు, జింక చంద్రశేఖర్, సాకే ఓబులేసు, అంబటి సతీష్, టిడిపి నాయకులు పరిసే సుధాకర్, జగ్గు షాకే ఓబులేసు, మద్దిలేటి, కమతం కాటమయ్య, బండి వెంకటేశులు, సంధ రాఘవ, జనసేన నాయకులు రాజారెడ్డి బెస్త శ్రీనివాసులు తోపాటు అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. (Story : పేదల ఆకలి తీర్చడానికే డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్ )  డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్ , ఎన్డీఏ కూటమి ,

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1