మంచితనానికి మరో పేరు వెల్ది రాంబాబు
సామాజిక చైతన్య వేదిక ఆర్గనైజర్ యివి.శ్రీనివాస్
న్యూస్ తెలుగు /చాట్రాయి : మంచితనానికి మరో పేరు పోలవరం పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు వెల్ది రాంబాబు అని ఆయన మరణం తీరని లోటు అని సామాజిక చైతన్య వేదిక ఆర్గనైజర్ యివి. శ్రీనివాసరావు కొనియాడారు. చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామానికి చెందిన పోలవరం పి ఎస్ సి ఎస్ మాజీ అధ్యక్షులు వెల్ది రాంబాబు గుండెపోటుతో మరణించారు. ఆయన మృతికి సామాజిక చైతన్య వేదిక ఆర్గనైజర్ ఈవీ శ్రీనివాస్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతు కుటుంభంలో పుట్టి పెరిగిన రాంబాబు మృదుస్వభావి అని కొనియాడారు.పిఎసిఎస్ అధ్యక్షునిగా రైతు శ్రేయస్సే ధ్యేయంగా పనిచేశారన్నారు. ఆయన అకాల మరణం చాలా బాధాకరమన్నారు.
రైతు శ్రేయస్సే ద్యేయంగా పోలవరం పిఎసిఎస్ సీఈఓ వై వి ప్రసాద్ రాజు మాట్లాడుతూ. వెల్ది రాంబాబు 2016 నుండి 2019 వరకు సంఘం అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారని మూడేళ్ల పాటు ఆయన పదవీకాలంలో 26 కోట్ల నుండి 60 కోట్ల వ్యాపార అభివృద్ధి జరిగిందన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతు శ్రేయస్సే ధ్యేయంగా ఆయన పని చేశారన్నారు. ఆయన అకాల మరణానికి పిఎసిఎస్ తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు తెలిపారు.