Homeవార్తలుతెలంగాణవిస్తృత పర్యటన - ఎమ్మెల్సీ దండే విఠల్

విస్తృత పర్యటన – ఎమ్మెల్సీ దండే విఠల్

విస్తృత పర్యటన – ఎమ్మెల్సీ దండే విఠల్

న్యూస్‌తెలుగు/ కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూర్ పెంచికల్ పేట్,మండలలోని కమ్మర్ గాం తదితర గిరిజన గ్రామాలను ఎమ్మెల్సీ దండే విఠల్ పర్యటించారు ఎమ్మెల్సీ కి గిరిజన నాయకులు,ఆదివాసి కోలేవార్ మన్నేవార్ సేవా సంఘం ఆధ్వర్యంలో శాలువతో సత్కరించారు.ఎమ్మెల్సీ నిధులు సిడిపి ద్వారా బెజ్జూర్ మండలం నుండి పెంచికల్ పేట మాండలం నందిగాం గ్రామం వరకు రోడ్ల మరమ్మతులకు 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

ఆదివాసి పోలేవారం మన్నేవారి సేవా సంఘం భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు వారు సానుకూలంగా స్పందించి భవన నిర్మాణం కు సంబంధించి నిధులు కేటాయింపు కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మెంబర్ అర్షద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. (Story : విస్తృత పర్యటన – ఎమ్మెల్సీ దండే విఠల్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!