UA-35385725-1 UA-35385725-1

రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర లో భాగమే ఎస్సీ వర్గీకరణ

రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర లో భాగమే ఎస్సీ వర్గీకరణ

 గోళ్ళ ఆరుణ్ కుమార్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు

న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక సిపిఎం కార్యాలయంలో బుధవారం జరిగిన మాల మహానాడు వినుకొండ నియోజకవర్గ కమిటీ విస్తృతస్థాయి సమావేశంలో అధ్యక్షులుగా నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు వ్యవహరించగా, ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బిజెపి ఎస్సీ , ఎస్టీల రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రక్రియ సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ ,క్రిమిలేయర్ తీర్పు ద్వారా బిజెపి కనుసనల్లో వెలువడిందని, బిజెపి మత ఉన్మాద పార్టీగా వ్యవహరిస్తూ ఒకపక్క క్రైస్తవులను మరోపక్క ముస్లింలను అణచివేస్తూ వారి హక్కులను కాలు రాస్తున్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీల మధ్య వివాదాన్ని పెంచి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న బిజెపి గతంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కూడా ఎత్తివేయాలని ప్రతిపాదన సుప్రీంకోర్టు ద్వారా పెట్టినప్పుడు ఎంతోమంది బలిదానాల పోరాటం ద్వారా తిరిగి ఆ చట్టాన్ని నిలుపుకోగలిగామని, నేడు వర్గీకరణ పేరుతో ఎస్సీ ఎస్టీలను విభజించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం మానుకోకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి అంతం మాలల పంతంతో ముందుకెళుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టు తీర్పు పై పునరాలోచించి తీర్పును వెనక్కి తీసుకునేలా ప్రభుత్వాల నుండి లేఖలు పంపాలని లేనిపక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించార. రాష్ట్ర అధ్యక్షులు డా గోదా జాన్ పాలు మాట్లాడుతూ బ్రిటిష్ వారి విభజించు పాలించు సిద్ధాంతం బిజెపి అమలు చేస్తుందన, దానికి వత్తాసుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పని చేస్తుందని ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలా మాదిగలు రెండు కళ్ళుగా చెప్పిన చంద్రబాబు నేడు వర్గీకరణ జిల్లాల వారీగా చేస్తానని చెప్పటం మాలల మనోభావాలను దెబ్బతీయటంతో పాటు రాజ్యాంగానికి తూట్లు పొడిచే తీర్పులను వ్యతిరేకించకపోతే కోర్టుల మీద వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని పల్నాడు జిల్లా లోని అన్ని నియోజకవర్గాలలో నియోజకవర్గ కమిటీ రానున్న రోజుల్లో మాలా మాదిగలను విడబడుతూ ఆర్టికల్ 341 ను ధిక్కరిస్తూ వచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రోడ్లపైకి రాస్తారోకోలు నిరసనల ద్వారా తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించేంతవరకు మన పోరాటానికి సంసిద్ధులై ఉండాలని పదవులు అలంకార ప్రాయంగా మాత్రమే కాక జాతి ప్రయోజనాల కొరకు కష్టపడి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ గ్రామ గ్రామాన మన పోరాటాలు ఉండాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ గోదాబాల, నరసరావుపేట నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షులు వుస్తెల జయరావు, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సేవా సామేలు, గౌరవాధ్యక్షులు వినుకొండ దార ఎర్రయ్య, కొమ్మ తోటి కృపారావు, ప్రచార కార్యదర్శి విప్పర్ల విజయేందర్ రావు, పట్టణ అధ్యక్షులు బేతం దేవానంద్, ఉపాధ్యక్షులు జ్యోతి మల్లికార్జున్, ఈపూరు మండల అధ్యక్షులు పెనుమాల వెంకటరావు,నూజెండ్ల మండల అధ్యక్షులు అందుకూరి గురుమూర్తి, శావల్యపురం మహిళా మండల అధ్యక్షురాలు శ్రీదేవి, బొల్లాపల్లి మండల యూత్ అధ్యక్షులు కీర్తిపాటి గోవిందరాజులు,దార్ల రాజు, సాతులూరి బసవయ్య, కుల్లి అనిల్, రాయన చిన్న, బిల్లా ఇశ్రాయేలు, కొమ్మతోటి సుధాకర్, అంబడపూడి శ్రీను, పల్లపాటి భాస్కర్, డోలా కరుణ, కొమ్మ తోటి బాలస్వామి, పెనుమాల శ్రీను, తదితరులు పాల్గొన్నారు. (Story : రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర లో భాగమే ఎస్సీ వర్గీకరణ )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1